పెరుగు - 200 గ్రా.
ఉలవచారు - 200 గ్రా.
గరంమసాలా - 20 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
పుదీనా - రెండు కట్టలు
ఏలకులపొడి - టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రా.
పైనాపిల్ పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
మిరప్పొడి - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - 250 గ్రా.(డీప్ ఫ్రై చేయాలి),
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
బిరియానీ ఆకులు - 3
నెయ్యి - 150 గ్రా.
ఉలవచారు పులావ్ తయారి
బాణలిలో నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లితరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిపేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి. చిన్న పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గరంమసాలా, ఏలకులపొడి వేసి వేయించి, నిమ్మరసం, ఉలవచారు వేసి కలపాలి. పెద్దపాత్రలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి. బిరియానీ ఆకులు, పచ్చిమిర్చిపేస్ట్, ఉలవచారు మిశ్రమం, నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి గరిటెతో కలిపి ఉడికించాలి.అన్నం సగం ఉడికిన తర్వాత, నెయ్యి కరిగించి అన్నం మీద వేసి కలపాలి. మూత పెట్టి సుమారు 20 నిముషాలు ఉడికించాలి. పుదీనా ఆకులు, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.























































0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !