settlers

పగటిపూటనిద్ర లాభాలు,Day time Sleep and benefits.- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మధ్యాహ్నం అలా కునుకు తీయడం మీకో అలవాటా? హాయిగా ఓ గంటపాటు మిట్టమధ్యాహ్నం నిద్దరోతున్నారా? అయితే మీ ఆరోగ్యానికేం ఢోకా లేదంటున్నారు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు. ఇకపై మీ వారు మధ్యాహ్నం ఆ మొద్దునిద్దరేమిటని అడిగితే అదో హెల్త్ సీక్రెట్ అని చెప్పండిక.
ఆరోగ్యంగా ఉండాలంటే కాసేపు కునుకు తీయడమే...! పగలు కొంతసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు నిపుణులు...! కొందరు కాసేపు కునుకు తీసుకుంటాను. అని అంటూనే నిద్రలోకి జారుకుంటుంటారు. ఇలా ఎక్కడపడితే అక్కడ కునుకు తీయడం కొందరికి అలవాటే. ఈ అలవాటే వారిని ఆరోగ్యవంతులుగా మారుస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మనలో చాలామంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గానీ తీరిక దొరికినప్పుడు గానీ కొద్దిసేపు కునుకు తీయటం చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కాసేపు నిద్రపోవటం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల మోతాదులు తగ్గుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
అప్పుడప్పుడు నిద్రపోవడం వల్ల మెదడుకు విశ్రాంతి చేకూరుతుంది. దీంతో శరీరం పునరుత్తేజితమవుతుంది. పైగా ఇలా కునుకు తీసుకునే వారికి మానసికపరమైన ఒత్తిడి, శారీరకపరమైన ఒత్తిడి దరిచేరవంటున్నారు పరిశోధకులు.
ఇలా కునుకు తీసేవారి జాబితాలో ప్రముఖులెందరో వున్నారు. వారిలో కొందరి పేర్లు మీకోసం... ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్, రోనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, హెచ్‌డి. దేవెగౌడ తదితర ప్రముఖులున్నారు. కాబట్టి సమయం, సందర్భం అనుకోకుండా మీరు అప్పుడప్పుడు చిన్న కునుకు తీస్తుంటే ఆరోగ్యంగా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు.
Note: Here we have used the CSS "float" property to align the image; as the align attribute is deprecated in HTML 4, and is not supported in HTML5.
!doctype>
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !